అసోం సీఎం భార్యపై ఆరోపణల కేసు... పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఊరట

  • ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
  • విదేశీ పాస్‌పోర్టులు, విదేశీ ఆస్తుల ఆరోపణలపై ఫిర్యాదు చేసిన అసోం సీఎం భార్య
  • పోలీసులు కేసు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ కోరిన పవన్ ఖేరా
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ భార్య రిణికి భూయాన్ శర్మపై అనుచిత వ్యాఖ్యల కేసులో సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి గౌహతి హైకోర్టు నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చందుర్కర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందస్తు బెయిల్ ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది.

తనకు పలు పాస్‌పోర్టులు ఉన్నాయని, విదేశీ ఆస్తులు ఉన్నాయంటూ కాంగ్రెస్ నేత చేసిన ఆరోపణలపై రిణికి భూయాన్ శర్మ గౌహతిలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం పవన్ ఖేరా అభ్యర్థించగా, గౌహతి హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పవన్ ఖేరా తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు.

Pawan Khera
Assam CM
Himanta Biswa Sarma
Riniki Bhuyan Sarma
Supreme Court
Defamation Case

More Telugu News